మెగా హీరోకు తమిళ తంబిల పాట సాయం!
on Jul 28, 2016
ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మరియు శింభు లు కలసి ఒకే సినిమాకి పాట పాడటం అనేది ఇదే మెట్టమెదటి సారి, అది కూడా తెలుగులో పాడటం విశేషం.. టాలీవుడ్ సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కోసం వీరిద్దరూ పాడటం చెరోక పాట పాడారు. వీరిద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... తమన్ స్వరపరచిన తిక్క చిత్రంలోని సాంగ్స్ ని ఫుల్ జోష్ తో పాడారు. 'తిక్క... తిక్క' అంటూ సాగే ఈ సాంగ్ ని ధనుష్ పాడగా.. 'హీ ఈజ్ హట్ షాట్' హీరో అనే లిరిక్ తో సాగే సాంగ్ ని శింభు పాడటం తో తిక్క చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మెగా అభిమానులతో పాటు, సామాన్య సిని ప్రేక్షకుల వరకూ అందరూ ఈ ఆడియో ని ఎప్పుడు విందామా అని వెయిట్ చేయటం విశేషం గా చెప్పుకోవాలి. ఈ మద్యకాలంలో ఇంతలా ఏ ఆడియోకి క్రేజ్ వచ్చివుండదు. ఈ ఆడియోని ఈ నెల 30 న మెగాఅభిమానుల సమక్షంలో విశిష్ట అతిధుల చేతులమీదుగా విడుదల చేస్తున్నారు.
Also Read