మిల్కీ బ్యూటీలు కలిస్తే రచ్చరచ్చే
on Mar 12, 2015
మన సినిమా హీరోయిన్లు ఈ మధ్య ఎక్కడ కలిసిన కూడా ముచ్చట్లతో, సేల్ఫిలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాంటిది ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే ఫ్లైట్ లో కలిస్తే? ఇంకేముంది ఫ్లైట్ అంతా తమ ముచ్చట్లతోనే గోల చేసేస్తారు. అలాంటిదే లేటెస్ట్ ఓ సంఘటన జరిగింది. మన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రయాణం చేయబోయే ఫ్లైట్ లోకి సడన్ గా మరో మిల్కీ బ్యూటీ ప్రత్యక్షమైంది. అంతే అందులో వున్న ప్రయాణికులు ఈ డబుల్ ధమాకా తట్టుకోలేక ఆనందంతో ఊగిపోయారు. ఇంతకీ ఆ ఫ్లైట్ రెండో బ్యూటీ ఎవరో కాదు మన హాన్సిక. వీరిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే ఫ్లైట్ ఎక్కేసారు. వాళ్ళు తారసపడేవరకు వాళ్ళిద్దరికి తెలియదు ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేయబోతున్నామని. అంతే ఇద్దరూ ఆలింగనం చేసుకోని, ముచ్చట్లు చెప్పుకొని, సేల్ఫిలు దిగి ఫ్లైట్ లో మొత్తం హంగామా చేశారట. దీంతో వారి అల్లరిని తట్టుకోలేని ప్రయాణికులు అమ్మో ఇద్దరూ ముద్దుగుమ్మలు కలిస్తే ఇలా వుంటుందా? అని అవాక్కయ్యారట.