గదిలో నుంచి బయటకు వచ్చిన తమన్నా..!
on Jul 3, 2019
ఇటీవల తమన్నా ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారి గది 3` చిత్రం ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకుందట. ఆమె స్థానంలో తాప్సీ రానుందట. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ లు కొడుతోన్న తాప్సీ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. మరి తమన్నా తప్పుకున్న ప్రాజెక్ట్ తాప్సీ చేస్తుందా? లేదా అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది. తన సొంత బేనర్ అయిన ఓక్ ఎంటర్టైన్ మెంట్ లో ఓంకార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `రాజుగారి గది` చిత్రం సక్సెస్ కావడంతో రాజుగారి గది -2 చేసాడు ఓంకార్. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ మంచి స్క్రిప్ట్ ని రాడీ చేసుకుని దానికి కొనసాగింపుగా రాజుగారి గది 3 చేస్తున్నాడు. మరి ఈ మూడో గదిలోకి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారు అనే దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.