కుల్ఫీ లాంటి భామతో సెల్ఫీకి సిద్ధమా ..!
on May 23, 2017

టాప్ హీరోయిన్ తో ఒక మంచి సెల్ఫీ దిగాలని ఉందా...అయితే ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెయ్యాలి మరి ...అంతే కాదండోయ్..గుర్తు పట్టేందుకు ఛాయలున్న ఒక చిత్రాన్ని చూపించింది.ఆమె ఎవరో కాదు..టాలీవుడ్ ద్వారా చిత్ర సీమ లో అడుగుపెట్టి అనేక చిత్రాలు చేసి తన సొట్టబుగ్గల హొయలతో మురిపించి బాలీవుడ్ లో అగ్ర నటులతో నటించి, తన సత్తా ఏంటో చూపిస్తున్న తరగని అందాల తాప్సి.ఆమె మళ్ళీ తెలుగుతెరపై మెరవనుంది.అయితే ఆ కొత్త చిత్రం టైటిల్ ను గుర్తుపట్టమని ఆసక్తికరమైన ఒక ఫొటోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది.
అంతేకాదు ఆ టైటిల్ గుర్తుపట్టి తనతో సెల్ఫీ దిగే అవకాశాన్ని గెలుచుకోమన్నది.ఆ పోస్టర్ పై 'భయానికి నవ్వుంటె భయం' అనేది చిత్రం పై ఆసక్తిని కలిగిస్తున్నది. 70 ఏం.ఏం.ఎంటర్ టైనర్ పై మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో తాప్సి నటించనుంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రానున్నది.టైటిల్ కనిపెట్టాలన్న విషయం తెలియగానే అభిమానులు టైటిల్ కనిపెట్టేపనిలో పడ్డారు. ఆ చిత్ర టైటిల్ కనిపెట్టి ఆమె తో సెల్ఫీ దిగే అదృష్టవంతులు ఎవరో మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



