దర్శకుడితో గొడవలే...
on Oct 23, 2018

'వీరభోగ వసంతరాయలు' ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు చిన్న షాక్.. హీరో సుధీర్‌బాబు వాయిస్ వినడానికి వింతగా వుందేంటి? అని! వీడియోలో వాయిస్ వినిపించిన రెండు మూడు క్షణాలకు ట్రైలర్‌లో సుధీర్‌బాబుకు ఎవరో డబ్బింగ్ చెప్పారని ప్రేక్షకులకు అర్థమైంది. తెరవెనుక ఏదో జరిగిందనీ, అదేంటో తెలుసుకోవాలని పలువురు ఆసక్తి కనబరిచారు. సోషల్ మీడియాలో దీనిపై డిస్కషన్ కూడా నడిచింది. దాంతో సుధీర్‌బాబు స్పందించక తప్పలేదు. తాను ఎందుకు డబ్బింగ్ చెప్పలేదో సరైన సమయంలో చెప్తానని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇండస్ట్రీ వర్గాలు దీనిపై ఆరాలు తీయడం మానలేదు. తాజాగా తెలిసింది ఏంటంటే... దర్శకుడు ఇంద్రసేనతో గొడవల కారణంగా సినిమాకు సుధీర్‌బాబు డబ్బింగ్ చెప్పలేదట.
'వీరభోగ వసంతరాయలు' రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా పూర్తయ్యాక... ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సుధీర్ బాబు, తాను నటించిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయమని కోరగా, అందుకు దర్శకుడు నిరాకరించార్ట. కథాగమనం దెబ్బ తింటుందని, మీరు సూచించిన మార్పులు చేయలేనని చెప్పార్ట. దాంతో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందనీ, సుధీర్ బాబు 'వీరభోగ వసంతరాయలు'కు డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణం అదేననీ టాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుస. దర్శకుడితో గొడవలే అసలు కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. సదరు వార్తలపై దర్శకుడు ఇంద్రసేన, హీరో సుధీర్ బాబు ఏమంటారో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



