శ్రుతి, హన్సికలకు షాక్ ఇచ్చిన శ్రీదేవి!
on Nov 22, 2014
వయసైపోయినా.. ఇప్పటికీ మన కంటికి అతిలోక సుందరిగానే కనిపిస్తుంది శ్రీదేవి. ఆమె అందానికీ, అభియన కౌశలానికీ ముగ్థుడైపోయిన ప్రేక్షకుడు లేడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిందోచ్ అనగానే దర్శకులు, నిర్మాతలూ ఆమె చుట్టూ ఈగల్లా ముసిరేశారు. కానీ ఇంగ్గిష్ వింగ్లిష్ తరవాత.. ఆమె ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కనికరించలేదు. ఇంతకాలానికి విజయ్ సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. ఇందులో శ్రుతిహాసన్, హన్సికలు కథానాయికలుగా నటిస్తున్నారు. హన్సికకు అమ్మగా శ్రీదేవి నటిస్తోందని చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదండోయ్.. ఈ సినిమా కోసం శ్రీదేవి అందుకొన్న పారితోషికం గురించి కూడా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలు నిర్మాతల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసిందట. హన్సిక, శ్రుతిహాసన్ ఇద్దరి పారితోషికాలు కలిపినా శ్రీదేవి పారితోషికంలో సగం కూడా చేయవు. దాంతో ఈ ఇద్దరి కథానాయికలకు మైండ్ బ్లాంక్ అయిపోయినంత పనైంది. అంతేకాదు.. సెట్లో ఇప్పుడు శ్రీదేవికే రాచమర్యాదలన్నీ జరుగుతున్నాయట. శ్రుతి, హన్సికలను నిర్మాతలు కూడా కేర్ చేయడం లేదట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్, హన్సికలు కూడా పెద్ద మనసుతో లైట్ తీసుకొన్నారట. ``శ్రీదేవిలాంటి గొప్ప నటితో కలసి నటిస్తున్నాం.. ఇంతకంటే కావల్సింది ఏముంది?`` అని సర్దిచెప్పుకొంటున్నారట. పాత బంగారమా...?? మజాకా!! ఈ సినిమాలో ఇద్దరు అందగత్తెలున్నా సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మాత్రం శ్రీదేవి నిలబడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది కదూ.