ప్రెస్ మీట్ లో ఏడ్చేసిన హీరో శింబు!
on Nov 18, 2021

కోలీవుడ్ స్టార్ శింబు నటించిన లేటెస్ట్ మూవీ 'మానాడు'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తో కలిసి అభిమానుల సమక్షంలో శింబు ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ 'నన్ను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కొద్ది నెలలుగా శింబుని సమస్యలు చుట్టుముడుతున్నాయి. శింబు కారణంగా తమకి నష్టం వచ్చిందని, నష్టపరిహారం చెల్లించాలి అంటూ.. ఇలా రకరకాల కారణాలతో పలువురు నిర్మాతలు శింబుపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. అయితే తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులతో శింబుపై కుట్రకు పాల్పడుతున్నారని ఆయన తల్లిదండ్రులు దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ శింబు ప్రెస్ మీట్ లో ఏడ్చేశాడు.
గత కొన్ని నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంటూ శింబు కంటతడి పెట్టుకున్నాడు. 'కానీ ఆ ప్రాబ్లమ్స్ సంగతి నేను చూసుకుంటాను. మీరు(అభిమానులు) మాత్రం నన్ను జాగ్రత్తగా చూస్కోండి' అంటూ ఫ్యాన్స్ ని ఉద్దేశించి శింబు మాట్లాడగానే.. ఫ్యాన్స్ తమ అరుపులతోనే మీకు మేమున్నామని శింబుకి భరోసా ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



