షూటింగ్ డేట్ కాదు చెప్పడానికి పెళ్లి డేట్...మా వెనుక పెద్దలు ఉన్నారు
on Apr 8, 2024
బొమ్మరిల్లు మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కధానాయకుడుగా మారిన హీరో సిద్దార్ధ్. ఆయన నటించిన చాలా చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అదితీరావు హైదరి, సిద్దార్ధ్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి .కానీ జరిగింది పెళ్లి కాదని ఎంగేజ్ మెంట్ అని అదితి ద్వారా అందరకి తెలిసింది. దీంతో ఇప్పుడు సీక్రెట్ ఎంగేజ్ మెంట్ అంటున్నారు ఇప్పుడు ఈ విషయాలన్నిటిపై సిద్దార్ధ్ తనదైన స్టైల్లో స్పందించాడు
నేను, అదితి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోలేదు. అయినా సీక్రెట్ అని ఎందుకు అంటున్నారు. మిమ్మల్ని పిలవనంత మాత్రాన అలా అంటారా! మా ఇద్దరి బంధువుల మధ్యన ఫంక్షన్ జరిగింది. అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పుకొచ్చాడు. పైగా పెళ్లి డేట్ విషయంలో కూడా తన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మాది షూటింగ్ డేట్ కాదు చెప్పడానికి. పెద్దలు నిర్ణయించిన డేట్ కి మా పెళ్లి జరుగుతుందని చెప్పాడు.
అలాగే అదితి తన లవ్ ప్రపోజల్ ని ఓకే చెయ్యడానికి ఎంత సమయం తీసుకుందనే విషయం మీద కూడా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగొద్దు. ఎందుకంటే నా ప్రపోజ్ ని అదితి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చాలా రోజులు టెన్షన్ పడ్డాను. చివరకి ఓకే చెప్పింది. ఇప్పడు మీరు అవన్నీ గుర్తు చెయ్యద్దు అని బదులిచ్చాడు.సిద్దార్ధ్ అదితి లు కలిసి 2021 లో వచ్చిన మహా సముద్రం అనే మూవీలో నటించారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.
Also Read