క్రైమ్ కామెడీతో మార్కులు కొట్టేశాడు.. 'భరతనాట్యం' డైరెక్టర్ నెక్స్ట్ పెద్ద ప్లానే వేశాడు!
on Apr 8, 2024
ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన 'దొరసాని' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.మహేంద్ర లేటెస్ట్ గా 'భరతనాట్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీమ్ ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది.
'భరతనాట్యం' సినిమాకి మంచి స్పందనే లభిస్తోంది. ఇందులో దర్శకుడు కె.వి.మహేంద్ర క్రైమ్ సీక్వెన్స్ తో పాటు, కామెడీ ఎపిసోడ్స్ ని డీసెంట్ గా హ్యాండిల్ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ, కథనాలు ఆకట్టుకుంటున్నాయని.. సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కె.వి.మహేంద్ర.. భవిష్యత్ లో భారీ సినిమాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. తన దగ్గర అదిరిపోయే మూడు పీరియాడిక్ క్రైమ్ డ్రామా స్క్రిప్ట్ లు ఉన్నాయని చెప్పిన ఆయన.. మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు ఆయన తన దగ్గర ఉన్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా స్క్రిప్ట్ లను ఏ హీరోలతో చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.
Also Read