'ఆచార్య' నుంచి బిగ్ అప్డేట్.. 'సిద్ధ' వచ్చేస్తున్నాడు!
on Nov 24, 2021

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సిద్ధ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'ఆచార్య' నుంచి సిద్ధ పాత్రకి సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సిద్ధ టీజర్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'ఆచార్య' నుంచి సిద్ధ టీజర్ ను నవంబర్ 28న విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చిరంజీవి, చరణ్ లపై డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో చరణ్ చేతిలో గన్ పట్టుకొని ఆవేశంగా పరుగెడుతూ కనిపించదు. అలాగే బ్యాగ్రౌండ్ లో చిరంజీవి కూడా అగ్రెసివ్ లుక్ లో ఉన్నాడు. పోస్టర్ ని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పోస్టరే ఇలా ఉంటే టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'ఆచార్య'లో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



