'శ్యామ్ సింగ రాయ్' సంచలనం.. నెట్ ఫ్లిక్స్ లో టాప్-3 సినిమాగా రికార్డ్!
on Jan 27, 2022
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ నెల 21 నుంచి ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో సంచలలు సృష్టిస్తోంది.
జనవరి 17 నుంచి జనవరి 23 మధ్య నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల టాప్-10 లిస్ట్ లో 'శ్యామ్ సింగ రాయ్' మూడో స్థానంలో నిలిచింది. జనవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న 'శ్యామ్ సింగ రాయ్' మూడు రోజుల్లోనే(జనవరి 21 - జనవరి 23) 3,590,000 వ్యూ అవర్స్ తో ఆ వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మూడవ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
ఆ వారం టాప్-10 లిస్ట్ లో మరే ఇతర భారతీయ సినిమా లేకపోవడం గమనార్హం. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలవడమే కానుందా ఓటీటీలో ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుండటంతో 'శ్యామ్ సింగ రాయ్' టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
Also Read