ఓటీటీ ఫైట్.. 'అఖండ'కు పోటీగా 'శ్యామ్ సింగ రాయ్'!
on Jan 8, 2022

ఇటీవల థియేటర్స్ లో విడుదలై ఆకట్టుకున్న సినిమాలు వరుసగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే డిసెంబర్ 17 న విడుదలైన 'పుష్ప ది రైజ్' అమెజాన్ ప్రైమ్ లో జనవరి 7 నుండి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే డిసెంబర్ 2 న విడుదలైన 'అఖండ' జనవరి 21 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇక డిసెంబర్ 24 న విడుదలై హిట్ గా నిలిచిన 'శ్యామ్ సింగ రాయ్' కూడా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలై రెండు వారాల్లో రూ.25 కోట్లకు పైగా హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో అలరిస్తుంటే.. 'శ్యామ్ సింగ రాయ్' కూడా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ సందడి చేయడానికి సిద్ధమైంది. జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో 'శ్యామ్ సింగ రాయ్' స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఓటీటీలో 'శ్యామ్ సింగ రాయ్' ఎంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
నాని గత చిత్రాలు వి, టక్ జగదీష్ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలై నిరాశపరిచాయి. ఈ క్రమంలో 'శ్యామ్ సింగ రాయ్'ను థియేటర్స్ లో విడుదల చేసి హిట్ కొట్టిన నాని.. ఈ సినిమాతో ఓటీటీలోనూ అదే స్థాయిలో మెప్పిస్తాడేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



