అఖండ` నిర్మాతతో `నారప్ప` దర్శకుడు!
on Jan 8, 2022

గత ఏడాది థియేటర్స్ లో రిలీజైన `అఖండ`, ఓటీటీలో స్ట్రీమ్ అయిన `నారప్ప`.. యాక్షన్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటించిన `అఖండ`తో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ చూడగా.. విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ లో యాక్ట్ చేసిన `నారప్ప`తో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. కట్ చేస్తే.. `అఖండ` నిర్మాత, `నారప్ప` దర్శకుడు ఓ సినిమా కోసం జట్టుకట్టనున్నారని సమాచారం.
Also Read: స్టార్ సినిమాటోగ్రాఫర్ కి `రౌడీ బాయ్స్`తోనే ఫస్ట్ టైమ్!
ఆ వివరాల్లోకి వెళితే.. `అఖండ` ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి తన బావమరిదిని హీరోగా పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం.. శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా ఎంచుకున్నాడని టాక్. అంతేకాదు.. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమవుతుందని అంటున్నారు. త్వరలోనే `అఖండ` నిర్మాతతో `నారప్ప` దర్శకుడి కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానున్నది.
కాగా, గతంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల `ముకుంద` చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఓ డెబ్యూ హీరోతో శ్రీకాంత్ చేయబోయే సినిమా ఇదే కానుండడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



