హోమో సెక్సువల్ సినిమాపై అరబ్ దేశాల్లో బ్యాన్
on Feb 21, 2020
హిందీ హీరో ఆయుష్మాన్ ఖురానా, నటుడు జితేంద్ర కుమార్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్'. ఇద్దరు మగాళ్ళు జంటగా నటించిన సినిమా అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇదొక గే ఎంటర్ టైనర్. ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథతో రూపొందిన సినిమా. అరబ్ దేశాలు అయినా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ సినిమాపై నిషేధం విధించారు. అక్కడ సినిమా విడుదల కాకుండా బ్యాన్ విధించారు. అక్కడికి నిర్మాతలు సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తామని తెలిపారట. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. హోమో సెక్సువల్ కథతో రూపొందిన ఈ సినిమాకి అక్కడ నిషేధం విధించినట్లు సమాచారం. సినిమాలో ఆయుష్మాన్, జితేంద్ర మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిని తొలగిస్తామని నిర్మాతలు అరబ్ దేశాల్లో సెన్సార్ అధికారులు చెబితే... హోమో సెక్సువల్ దీని కారణంగా సినిమాపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారట.