సరోగసీ ద్వారా కూతుర్ని కన్న హిందీ హీరోయిన్
on Feb 21, 2020
ప్రముఖ హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దంపతులకు ఫిబ్రవరి 15న కుమార్తె పుట్టింది. ఇద్దరికీ ఇది రెండో సంతానం. వీళ్లకు 7 ఏళ్ళ కుమారుడు వియాన్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మాయికి శమిషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టారు. విచిత్రం, విశేషం ఏమిటంటే... శిల్పాశెట్టి గర్భవతి కాలేదు. మరి, కుమార్తె ఎలా పుట్టింది? అనుకుంటున్నారా!? ఈ దంపతులు ఇద్దరు సరోగసీ ద్వారా కుమార్తెను కన్నారు. ఇంతకుముందు బాలీవుడ్ సెలబ్రెటీలు షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఇదేవిధంగా పిల్లల్ని కన్నారు. పెళ్లి చేసుకొని ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్, నటుడు తుషార్ కపూర్, నిర్మాత ఏక్తా కపూర్ కూడా సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారు. అయితే... సరోగసీ ద్వారా కుమార్తెను కన్న తొలి హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి అని సమాచారం.
తెలుగులోనూ శిల్పాశెట్టి కథానాయికగా నటించారు. సాహస వీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబోయ్, ఆజాద్, భలేవాడివి బాసు చిత్రాలు ఆమె నటించారు. ఇటీవల అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంములో' చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read