శ్రీహరి కుమారుడు... రాజశేఖర్ కుమార్తె జంటగా!
on Jun 8, 2019
శ్రీహరి రెండో కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా 'రాజ్‌ధూత్'. జీవితా రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కథానాయికగా పరిచయమవుతున్న సినిమా 'దొరసాని'. ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాలేదు. టీజర్లు మాత్రం విడుదలయ్యాయి. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. నటన ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. అయితే అప్పుడే ఇద్దరితో సినిమా చేయడానికి ఓ ఔత్సాహిక దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 'రాజ్‌ధూత్' టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జీవిత ఈ విషయాన్ని చెప్పారు. మేఘాంశ్, శివాత్మిక చిన్నప్పటి నుంచి స్నేహితులు అని తెలిపారు. మంచి కథ కుదిరితే ఇద్దరూ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఆ కథతో ఇద్దరినీ మెప్పించే దర్శకుడు ఎవరో?