ఈ భూమి నా రాక కోసం వేచి ఉంది
on Oct 15, 2024
ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో తెలుగు తెరకి పరిచయమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్,ఆ తర్వాత వరుసగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.ప్రస్తుతం హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో ఒక మూవీ చేస్తున్నాడు.ఎస్ డి టి 18 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమయ్యింది.
ఈ రోజు తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ చిత్ర యూనిట్ మూవీ కి సంబంధిచిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది.అందులో ఎస్ డి టి 18 చిత్రం యొక్క మేకింగ్ విశేషాలతో పాటు తేజ్ క్యారక్టర్ ఏ విధంగా ఉండబోతుందో చెప్పారు.కండల తిరిగిన దేహంతో భగ భగ మండుతున్నఅగ్ని కణాల మధ్య ఉన్న తేజ్ స్టిల్ తో పాటు ఈ భూమి అతని రాక కోసం చాలా కాలం వేచి ఉంది, ఈ నిరీక్షణ ముగిసింది, ఇది ప్రారంభం మాత్రమే లాంటి క్యాప్షన్స్ సినిమా పట్ల అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ ని కలిగిస్తున్నాయి.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడుగా పరిచయం కాబోతుండగా ఐశ్వర్య లేక్ష్మి హీరోయిన్ గా చేస్తుంది.ఇక మెగా అభిమానులు తేజ్ కి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటుగా విరూపాక్ష, బ్రో మూవీలతో వరుస విజయాల్ని అందుకున్న తేజ్ ఈ సారి హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read