సుశాంత్ సింగ్ ఇంటి గురించి బయటపడిన అసలు నిజం..నిజంగానే శక్తీ దాగి ఉందా!
on Oct 15, 2024
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్(sushant singh rajpur)తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిందే.సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో పాటు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తీవ్ర మానసిక కుంగుబాటుకి గురవ్వడం వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్దారించారు.ఇప్పుడు ఈ విషయాన్నీ మరోసారి ఎంధుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సుశాంత్ ఇంటి గురించి ప్రముఖ హీరోయిన్ ఆదాశర్మ(adah sharma)కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కొన్నిరోజుల క్రితం సుశాంత్ ఇంటిని కొనుగోలు చేసిన ఆదాశర్మ రీసెంట్ గా కుటుంబంతో సహా అక్కడకి షిఫ్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు సుశాంత్ ఇల్లు నాకు ఎంతగానో నచ్చడంతో పాటుగా ఇంటిని చూడగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది.పైగా ఇంట్లో ఏదో తెలియని శక్తీ ఉందనేది నా నమ్మకం. ఇంటిని చాలా వరకు రీమోడల్ చేయించాను.మొదటి అంతస్థుని గుడిగా మార్చడంతో పాటుగా డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసానని చెప్పుకొచ్చింది.
ఇక ఆదాశర్మ పబ్లిసిటీ కోసమే సుశాంత్ ఇంటిని కొనుగోలు చేసిందనే వాళ్ళకి కూడా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది.మన జీవితంలో చెయ్యాల్సిన పనులు చాలా ఉంటాయి.ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు,నేను మంచిదానిని అని వాళ్లందరికీ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సుశాంత్ ఇల్లు నచ్చింది కాబట్టి కొనుక్కొని ఉంటున్నాను.నా కోసం ఎవరు మారకూడదని కూడా నేను కోరుకుంటాను.ఎందుకంటే వాళ్ల కోసం నా పద్ధతులు మార్చుకోను కదా అని చెప్పుకొచ్చింది.