సమంత 'యస్' అనేస్తే...
on Dec 14, 2018
.jpg)
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా '96' రీమేక్ రైట్స్ దిల్ రాజు కొన్నారు. సినిమా నచ్చడంతో రీమేక్ రైట్స్ కొనడానికి ముందో... తరవాతో.. హీరోలు అల్లు అర్జున్, నానికి చూపించారు. వాళ్ల అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని! అందువల్ల, '96' తెలుగు రీమేక్‌లో హీరోగా ముందు అల్లు అర్జున్ పేరు వినిపించింది. తరవాత నాని పేరు వినిపించింది. అసలు విషయం ఏంటంటే.. '96' రీమేక్‌లో ఇద్దరూ నటించడం లేదు. యువ హీరో శర్వానంద్ నటించనున్నాడు. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తారని టాక్. తమిళంలో త్రిష హీరోయిన్. తెలుగులో ఆమె పోషించిన పాత్రకు సమంతను తీసుకోవాలని దర్శక నిర్మాతల ఆలోచన. ఆల్రెడీ సినిమా చూసిన సమంత తెలుగు రీమేక్‌లో నటించడానికి సుముఖంగా వున్నారట. ఆమె 'యస్' అనేస్తే జనవరి తరవాత పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



