`జానకీ దేవి`లా సమంత!!
on Mar 5, 2019
ఇటీవల కాలంలో తమిళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన చిత్రం ` 96`. ఈ సినిమా ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అవుతోంది. అఇయతే తెలుగులో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. వీరిద్దరకీ ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. కోలీవుడ్ కు ఈ సినిమా ఒక క్లాసికల్ సినిమాలో నిలిచిపోయిందనడంలో సందేహం లేదు. అయితే తెలుగులో కూడా తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వానంద్, సమంతలు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీ కి తగిన విధంగా కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో ఈ సినిమాకు `జానకీ దేవి` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు, ఫిలించాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ లో సినిమా షూటింగ్ ప్రారంభం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
