మహేష్, త్రివిక్రమ్ ని ఇంటర్వ్యూ చేసిన సమంత
on Nov 30, 2014
'హుద్ హుద్' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦లో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి అందాల తార సమంత చేసిన ఈ ఇంటర్వ్యూ అందరిని ఆకట్టుకుంది. మహేష్ కెరీర్ గురించి సమంత, సమంత గురించి త్రివిక్రమ్.. ఇలా ప్రశ్నలడుగుతూ కార్యక్రమాన్ని రసవత్తరంగా కొనసాగించారు.ఈ ముగ్గురి పరస్పర ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్ ప్రస్తావన రావడం. పవన్, మహేష్ చాలా విషయాల్లో ఒకేలా వ్యవహరిస్తారనీ, అదే తనను ఆ ఇద్దరికీ సన్నిహితుడ్ని చేసిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడని సమంత ప్రశ్నిస్తే, ఖచ్చితంగా 2015లో వుంటుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ సమాధానమిచ్చారు.