మంచు బ్రదర్స్ కబడ్డీ: మనోజ్ టీమ్ విజేత
on Nov 30, 2014
తెలుగు సినీ చిత్రపరిశ్రమ చేపట్టిన ‘మేముసైతం’ కార్యక్రమంలో భాగంగా మంచి ఫ్యామిలీ కబడ్డీ జట్టు మొత్తం కార్యక్రమానీకే హైలైట్ గా నిలిచింది.కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మంచు విష్ణు, మంచు మనోజ్ టీంలు తలపడ్డాయి. మనోజ్ టీంలో బ్రహ్మానందం చేసిన హంగామా వీక్షకులకు వినోదం అందించింది. రిఫరీగా మంచు మోహన్ బాబు, వ్యాఖ్యాతగా విక్టరీ వెంకటేష్ ల సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో మంచు మనోజ్ టీమ్ రెండు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.