సల్మాన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది
on May 6, 2015
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ముంబాయి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ముంబయి షెన్షన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దాంతో ఆయన్నీ ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలుకు తరలించారు. సల్మాన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.... ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టుకు విన్నవించారు. దీంతో సల్మాన్‌కు రెండు రోజు పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.