మెగాస్టార్ 'ఆచార్య'.. 'శానా కష్టం' వచ్చింది!
on Jan 3, 2022

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఫిబ్రవరి 4 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో సాంగ్ ని విడుదల చేసింది మూవీ టీమ్.
'ఆచార్య' నుంచి 'శానా కష్టం' అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. రేవంత్, గీతా మాధురి ఆలపించిన ఈ సాంగ్ మాస్ ని మెప్పించేలా ఉంది. మణిశర్మ మ్యూజిక్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి యంగ్ హీరోయిన్ రెజీనా చిందేసింది. లిరికల్ వీడియోలో రెజీనా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ తో మెగాస్టార్ మరోసారి తన గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారని లిరికల్ వీడియోలోని స్టెప్స్ చూస్తే అర్థమవుతోంది. వింటేజ్ మెగాస్టార్-మణిశర్మ కాంబోలో వచ్చిన సాంగ్స్ ని గుర్తు చేస్తున్న 'శానా కష్టం' ఆడియన్స్ ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



