'సాహో' ఫస్ట్ రివ్యూ: ప్రభాస్ విలన్‌గా కనిపించడం మాస్టర్ స్ట్రోక్!
on Aug 26, 2019
దేశమంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న 'సాహో' మూవీ ఆగస్ట్ 30న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అంతకు 4 రోజుల ముందుగానే ఆ సినిమా ఎలావుందనే ప్రాథమిక సమాచారం వచ్చేసింది. యూఏఈలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, అక్కడి సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు 'సాహో' ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఆగస్ట్ 23నే ఈ మూవీని అక్కడి సెన్సార్ మెంబర్స్ చూశారు. అప్పుడే "ఫస్టాఫ్ మీ మైండ్స్‌ని బ్లాక్ చేస్తుంది. ప్రభాస్ ఎంట్రీ పైసా వసూల్. స్టంట్స్‌కీ, చేజింగ్స్‌కీ గూస్‌బంప్స్ వస్తాయి. ఆంటాగనిస్ట్ (విలన్)గా ప్రభాస్ కనిపించడం ఒక మాస్టర్ స్ట్రోక్" అని ట్విట్టర్ ద్వారా ఫీలర్స్ వదిలిన సంధు తాజాగా మూవీపై మరికొంత సమాచారాన్ని అందించాడు.
'సాహో'కు 4 స్టార్ రేటింగ్ ఇచ్చిన సంధు "మీరు గనుక హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, స్లీక్ విజువల్స్, మెలోడియస్ మ్యూజిక్, మసాలా మూవీస్‌ను ఇష్టపడేవారైతే, ఈ వారాంతం డెఫినెట్‌గా 'సాహో'కి వెళ్లండి. ఇప్పుడు ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్" అని ట్వీట్ చేశాడు.
తన పాత్ర పోషణలో ప్రభాస్ ఎలాంటి మిస్టేక్స్ చేయలేదని సంధు తెలిపాడు. "సునాయాసంగా నటించగల, స్టైల్‌గా ఫైట్స్ చెయ్యగల, ఆడియెన్స్‌ను తన చార్మింగ్‌తో అలరించగల ప్రభాస్ ఈ మూవీలో పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరోగా కనిపించాడనేది కాదనలేని నిజం" అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. శ్రద్ధా కపూర్ టెర్రిఫిక్‌గా కనిపిస్తుందని కూడా ఆయన చెప్పాడు. ఆయన మాటల్లో నిజం ఎంతుందో ఆగస్ట్ 30న స్పష్టం కానున్నది.