రవితేజ పోలీస్ సెంటిమెంట్.. మాస్ జాతర పరిస్థితి ఏంటి..?
on Oct 29, 2025

మాస్ జాతరలో రైల్వే పోలీస్ గా రవితేజ
మరో విక్రమార్కుడు అవుతుందా..?
ఖతర్నాక్ లా షాక్ ఇస్తుందా..?
మాస్ మహారాజా రవితేజ (RaviTeja) పేరు వింటే మాస్, కామెడీ ఎంతగా గుర్తుకొస్తాయో.. పోలీస్ పాత్రలు కూడా అంతే గుర్తుకొస్తాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న 'మాస్ జాతర' చిత్రంలోనూ.. రైల్వే పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు రవితేజ. ఈ నేపథ్యంలో ఆయన పోలీస్ రోల్స్ చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. (Mass Jathara)
రవితేజ పోలీస్ రోల్ అంటే మొదట గుర్తుకొచ్చే సినిమా 'విక్రమార్కుడు'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరుని అంత తేలికగా ఎవరూ మరిచిపోలేరు. అలాగే వెంకీ, పవర్, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి పలు హిట్ సినిమాల్లో పోలీస్ పాత్రల్లో అలరించారు రవితేజ. దుబాయ్ శీను, కిక్ వంటి హిట్స్ లోనూ చివరిలో పోలీస్ గా కనిపించి సర్ ప్రైజ్ చేయడం విశేషం. రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించిన 'మిరపకాయ్' కూడా మంచి విజయం సాధించింది.
Also Read: ఆ హీరోతో రవితేజ క్రేజీ మల్టీస్టారర్..!
రవితేజ పోలీస్ గా కనిపించిన సినిమాల్లో ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. ఆయన ట్రాఫిక్ పోలీస్ గా కనిపించిన 'ఖతర్నాక్' పరాజయం పాలైంది. ఏసీపీ రోల్ ప్లే చేసిన 'టచ్ చేసి చూడు' కూడా చేదు ఫలితాన్నే ఇచ్చింది.
రవితేజ ఫిల్మోగ్రఫీని గమనిస్తే.. ఆయన పోలీస్ గా నటించిన సినిమాల్లో మెజారిటీ విజయాలు ఉన్నాయి. మరి అదే బాటలో 'మాస్ జాతర' కూడా పయనిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



