హీరోలకి నిర్మాతలకి షాక్ ఇచ్చిన సీఎం
on Oct 28, 2025

- ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
- హీరోలు, నిర్మాతలు ఏం చేస్తారు
- సినీ ఫెడరేషన్ కి రేవంత్ రెడ్డి గిఫ్ట్
ఇప్పడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్. ఈ పాన్ ఇండియాట్రెండ్ లో ముందు వరుసలోఉంది మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ. ఇందుకు కారణం మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడమే. మరి ఈ లెక్కన నిర్మాత ఎంత ఖర్చు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే సదరు నిర్మాతలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నాయి.
రీసెంట్ గా హైదరాబాద్ లో తెలుగు సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ మీటింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకి ముఖ్య అతిదిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు సినిమా టికెట్ రేట్లు పెంచితే నిర్మాతలకి, హీరోలకి ఆదాయం వస్తుంది. కానీ కార్మికులకి ఎలాంటి లాభం లేదు. కాబట్టి టికెట్ రేట్స్ పెంచితే వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకి ఇవ్వాలి. ఈ మేరకు జివో ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది.
Also read: బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



