అసలు ఈ భీమ్స్ ఎవరు!.. చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది
on Oct 29, 2025

- ఫ్యామిలీ తో సహా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా
- రవితేజ సార్ దేవుడు
- మాస్ మహారాజా ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే
- భీమ్స్ స్పీచ్ వైరల్
టాలెంట్ ఉండి తనని నమ్ముకున్న వాళ్లకి తెలుగు సినిమా కళామతల్లి ఎప్పుడు అండగా ఉండటంతో పాటు వాళ్లకంటు ఒక టైంని ఇస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ప్రముఖ సంగీత దర్శకుడు 'భీమ్స్ సిసిరోలియో'(Bheems Ceciroleo). మాస్, క్లాస్, ఫ్యామిలీ, ఫోక్ సాంగ్స్ లో తనదైన శైలిలో దూసుపోతున్నాడు. నవంబర్ 1 న మాస్ మహారాజా రవితేజ తో చేసిన తన కొత్త చిత్రం 'మాస్ జాతర'(Mass Jathara)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో భీమ్స్ మాట్లాడుతు రవితేజ సార్ తో చేసిన థమాకా ఆఫర్ రావడానికి ముందు ఇంటి అద్దె ఎలా కట్టాలి. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి. అసలు రేపు ఎలా బతకాలి అని భార్య పిల్లలతో చనిపోదామని అనుకున్నాను.
అలాంటి చిట్టచివరి క్షణంలో ఉన్నప్పుడు ఒక రాముడిలా, జీసస్ లా, అల్లా గా తిరుపతి వెంకటేశ్వర స్వామిలా రవితేజ(Raviteja)గారు నాకోసం నిలబడ్డారు. రవితేజ సార్ లేకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకునే వాళ్లమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భీమ్స్ ఎవరనే చర్చ జరుగుతుంది.
. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం భీమ్స్ స్వస్థలం. సంగీత దర్శకుడి కంటే ముందు పాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2003 లో రాజశేఖర్, ఎన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆయుధం' మూవీలోని 'ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే' అనే పాటని రాసాడు. ఈ సాంగ్ నేటికీ చాలా చోట్ల మారుమోగిపోవడమే కాకుండా సదరు పాటలోని లిరిక్స్ ప్రతి ఒక్కరు పాడుకునే విధంగా అచ్చ తెలుగు పదాల్లో ఉంటాయి.ఆ తర్వాత 2011 లో సీమటపాకాయ అనే చిత్రంలో ఒక పాట రాసాడు.
Also read: హీరోలకి నిర్మాతలకి షాక్ ఇచ్చిన సిఎం
ఇక 2012 లో అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా వచ్చిన 'నువ్వా నేనా' అనే చిత్రంతో సంగీత దర్శకుడుగా మారాడు. ఈ చిత్రంలోని 'బ్లాక్ బెర్రీ' సాంగ్ చాలా పాపులర్. ఒక్కసారిగా భీమ్స్ ఎవరని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. ఈ చిత్రం నుంచి థమాకా వరకు భీమ్స్ సుమారు పద్నాలుగు సినిమాల దాకా సంగీతాన్ని అందించాడు. అందులో రవితేజ తో చేసిన బెంగాల్ టైగర్ తప్ప మిగతా సినిమాలన్నీ ఒక మోస్తరు హీరోలవే. పైగా సక్సెస్ కూడా కాలేదు.
సినిమా సక్సెస్ అయితేనే మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా పేరుతో పాటు డబ్బు వస్తుంది. అందుకే తన పర్సనల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి రవితేజ అందించిన థమాకా చాలా స్పెషల్. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తో అగ్ర శ్రేణి సంగీత దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో అవకాశం కొట్టి మీసాల పిల్ల సాంగ్ తో ట్రెండ్ సెట్టర్ గా మారాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



