పెళ్లి,సినిమా ఏది ముందో ?
on Jul 24, 2018
బద్రి సినిమాతో వెండి తెర అరంగేట్రం చేసి మన తెలుగు ప్రజల అభిమానాన్ని, పవన్ కళ్యాణ్ ప్రేమని గెలుచుకున్నకథానాయిక రేణు దేశాయ్. ఆమె తెలుగులో నటిచింది రెండు సినిమాలే అవి కూడా పవన్ తో నే.ఈ రెండు సినిమాలతో వీరి మధ్య స్నేహ బంధం చిగురించింది అది కాస్త చివరికి ప్రేమగా మారింది.ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు..వీరికి ఇద్దరు పిల్లలు.దీంతో ఆమె కొన్నేళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. కానీ కొంత కాలానికి వీరు విడిపోయారు.
.jpg)
పవన్ నుంచి విడిపోయాక కూడా రేణు నటనపై దృష్టి పెట్టలేదు.ఇటీవల బుల్లితెరపై ఓ రియాలిటీ షోలో కనిపించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు,ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు కానీ నటనకు మాత్రం దూరంగానే ఉన్నారు. ఇటీవలే రేణుకి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన వివాహానికి ముందే నటిగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే పుకారు ఫిలింనగర్‌లో షికారు చేస్తోంది.అయితే వివాహం తర్వాతే రీఎంట్రీ ఉంటుందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై ఎటువంటి అధికారక ప్రకటన చేయకపోవటంతో ఏది ముందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి ఉండకతప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



