సినిమా వద్దు.. చదువే ముద్దు.
on Jul 24, 2018
ఓ చిత్రంలో ఓ సన్నివేశంలో కన్ను కొట్టి, ఆ వీడియో వైరల్ అవ్వటంతో ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ సంపాదించింది ప్రియా వారియర్.అయితే ఆమె ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉందట.ప్రియా పాపులారిటీ చూసి చాలా మంది దర్శక,నిర్మాతలు తమ సినిమాలో నటించమని క్యూ కట్టారు.సినిమాల్లో నటిస్తే చదువు అటకెక్కుతుందని సున్నితంగా వారు ఇచ్చిన అవకాశాన్నితిరస్కరించిందట.

ఆమెను ఒప్పించడం కష్టమనుకున్న దర్శకనిర్మాతలు నెమ్మదిగా సైడ్ అయిపోయారు.సినిమా అయితే ఎక్కువ కాలం పడుతుండటంతో చదువుకి ఇబ్బంది అవుతుందని వాణిజ్య ప్రకటనలు చేయటానికి సిద్ద పడిందట.కానీ ఆమెతో చేయించుకోవడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఓ కంపెనీ యాడ్ లో నటించే అవకాశం వచ్చినా ఆమె అడిగిన పారితోషకం తో ఆ కంపెనీ ముందు సుముఖత వ్యక్తం చేసినా, ఆ తరువాత ఆలోచనలో పడిందట.దీంతో ఆ ప్రకటన ప్రియా చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇంతకీ ఆమె అడిగిన పారితోషకం అక్షరాలా కోటి రూపాయలట.దీంతో వాణిజ్య ప్రకటనల్లో నటించాలనుకున్న ప్రియా ఆశలు నెరవేరకపోవచ్చని కొందరు అంటున్నారు.అయితే ప్రకటనకు సంబంధించి షూటింగ్ మొదలైందని కొందరు, ఇంకా మొదలు కాలేదనీ కొందరు అంటున్నారు.నిజనిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



