రవితేజ, తారక్, చరణ్ లోకల్.. బన్నీ ఏమో నేషనల్..!
on Dec 16, 2021

గత కొంతకాలంగా తెలుగునాట ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేమిటంటే.. అగ్ర కథానాయకులు సైతం `లోపం` ఉన్న పాత్రల్లో కనిపించడం. మరీ ముఖ్యంగా.. గడిచిన నాలుగేళ్ళల్లో ఇలాంటి వాతావరణం బాగా ఊపందుకుంది. దానికితోడు.. ఈ తరహా ప్రయోగాత్మక పాత్రలతో విజయాలు సైతం సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు ఆయా స్టార్స్.
కాస్త వివరాల్లోకి వెళితే.. 2017లో `జై లవ కుశ` కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముచ్చటగా మూడు పాత్రల్లో కనిపించారు. అందులో `జై` పాత్రకి నత్తి ఉంటుంది. ఆ లోపమే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్ కూడా తన అభినయంతో ఆ పాత్రకి రక్తి కట్టించి.. సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆపై అదే ఏడాది `రాజా ది గ్రేట్` అంటూ పలకరించారు రవితేజ. ఇందులో ఆత్మవిశ్వాసం ఉన్న అంధుడిగా తనదైన అభినయంతో మెస్మరైజ్ చేశారు మాస్ మహారాజా. ఆనక `రంగస్థలం`లో వినికిడి లోపం ఉన్న యువకుడి పాత్రలో కనిపించి.. 2018 ప్రథమార్ధంలో సంచలన విజయం అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
Also Read:విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను కట్టించబోతున్న ప్రభాస్!
కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే బాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళుతున్నారు. విడుదలకు సిద్ధమైన `పుష్ప - ద రైజ్`లో భుజం పైకి ఎగురవేస్తూ కాస్త గూని ఉండే క్యారెక్టర్ లో దర్శనమివ్వబోతున్నారాయన. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రవితేజ, తారక్, చరణ్ చేసిన ప్రయోగాలు తెలుగుకే పరిమితమైతే.. బన్నీ మాత్రం `పాన్ - ఇండియా` టచ్ ఇస్తున్నారు.
మరి.. రవితేజ, తారక్, చరణ్ లోకల్ గా ఇంప్రెస్ చేసినట్టే బన్నీ కూడా ఈ ప్రయోగాత్మక పాత్రతో నేషనల్ వైడ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. కాగా, సుకుమార్ డైరెక్ట్ చేసిన `పుష్ప - ద రైజ్` రేపు (డిసెంబర్ 17) థియేటర్స్ లోకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



