రాజుగారి గదికి రష్మీ కూడా వెళ్తోంది!!
on Jul 15, 2019

`రాజుగారిగది` సినిమాతో డైరక్టర్ గా మారాడు ఓంకార్. అది చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అయింది. ఇక ఉత్సాహంతో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో `రాజుగారి గది-2` చిత్రం రూపొందింది. అయితే ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక ఇటీవల `రాజుగారి గది-3` తమన్నా ప్రధాన పాత్రలో షూటింగ్ లాంచనంగా ప్రారంభించారు. ఇంతలో తమన్నా రాజుగారి గది 3 నుంచి తప్పుకుందంటూ వార్తలు వచ్చాయి. కారణాలు ఏంటని ఆరా తీయగా ఓంకార్ ఫస్ట్ చెప్పి ఒప్పించని కథకి తర్వాత చెప్పిన కథకి పొంతన లేకపోవడంతో ఆమె తప్పుకుందని తెలిసింది. దీంతో తాప్సీ, కాజల్ ను సంప్రదించగా భారీ రెమ్యూనిరేషన్ డిమాంట్ చేసారనీ, దీంతో అవికా గోర్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో పాత్ర కోసం రష్మీ గౌతమ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



