`కబీర్ సింగ్` ఎందుకు చూడాలన్న `అర్జున్ రెడ్డి`!!
on Jul 15, 2019
విజయ్ దేవరకొండకు విపరీతమైన ఫాలోయింగ్ ను, క్రేజ్ ను స్టార్ డమ్ ను తెచ్చిన సినిమా `అర్జున్ రెడ్డి.` ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ వంగా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ని రీమేక్ గా `కబీర్ సింగ్` సినిమా చేసాడు. ఈ సినిమా ఇటీవల విడుదలై మూడు వందల కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలివడం విశేషం. ఇక `ఈ సినిమా నేనేందుకు చూడాలన్న` ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసాడు ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ లో విజయ్ దేవరకొండ. ఒక సారి ఆ విశేషాల్లోకి వెళితే...
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ , రష్మిక జంటగా `డియర్ కామ్రేడ్ ` చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నె 26న విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ కార్యక్రమంలో `కబీర్ సింగ్` సినిమా చూసారా అని అడగ్గా....అందుకు విజయ్ బదులిస్తూ....`` అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అని, అందులో షాహిద్ కపూర్ నటించడానీ, ఆ స్టోరి, దర్శకుడు అన్నీ నాకు తెలుసు ..ఇందులో కొత్తేముంది ..నేనెందుకు కబీర్ సింగ్ మూవీ చూడాలంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు సందీప్ వంగా నా మనిషి, కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడం చాలా సంతోషంగా ఉంది...ఇంకా పెద్ద విజయం సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు సెన్సేషనల్ హీరో.