ENGLISH | TELUGU  

'రాశీ ఖన్నా'ను భయపెడుతుంది ఎవరు?

on Dec 29, 2021

అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాలి. 

సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీకి తమిళంలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో 'అంతఃపురం' పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. గతంలో తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైన 'అరణ్మణై', 'కళావతి'గా విడుదలైన 'అరణ్మణై 2' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో 'అంతఃపురం' టైటిల్ తో వస్తున్న 'అరణ్మణై 3'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి రాశీ ఖన్నా ప్రత్యేక ఆకర్షణ కానుంది. గ్లామర్ రోల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ ఖన్నా.. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లో భయపడుతూ కనిపించనుంది.

సుందర్ సి మాట్లాడుతూ.. "అరణ్మణై ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో 'చంద్రకళ', 'కళావతి'గా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ 'అంతఃపురం' కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా. ఈ నెల 31న సినిమాను విడుదల చేస్తున్నాం" అని అన్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.