రభస కోసం చెన్నైలో అనూప్
on Aug 17, 2013
ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రభస". నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ చిత్రానికి మొదటిసారి సంగీతం అందిస్తుండటం వలన ఈ చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నాడట అనూప్. ప్రస్తుతం "రభస" చిత్ర సంగీతం కోసం అనూప్ చెన్నై వెళ్ళాడు. ఈ చిత్రం కనుక సంగీత పరంగా హిట్టయ్యిందంటే.. అనూప్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకడిగా స్థానం సొంతం చేసుకున్నట్టే. మరి ఆ జాబితాలోకి అనూప్ చేరుతాడో లేదో చూడాలి.