బాహుబలికి రామోజీ ప్రశంసలు
on Sep 14, 2013

"బాహుబలి" చిత్ర షూటింగ్ సమయంలోనే అరుదైన ప్రశంసలను అందుకుంటుంది. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రభాస్ ,రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ సింబు సిరల్ అద్వర్యంలో వేశారు. ఈ సెట్ ను ఇటీవలే రామోజీరావు చూసారు. ఈ సెట్ తనకు ఎంతగానో నచ్చడంతో.. ఇలాంటి సెట్ మా ఫిల్మ్ సిటీలో వేసినందుకు చాలా సంతోషంగా ఉందని, సింబు సిరెల్ పనితనం బాగుందని రాజమౌళి, సింబు సిరెల్ లను మెచ్చుకుంటూ ఓ లేఖను రాశారు. ఈ లేఖతో రాజమౌళి చాలా ఆనందంగా ఉన్నాడు. రామోజీ గారి దగ్గర నుండి ఇలాంటి ప్రశంస అందుకున్నరాజమౌళికి 100 అవార్డులతో సమానం అని ఫేస్ బుక్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రాజమౌళి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



