Home

»

Latest News

విజయ్‌ దేవరకొండతో నాకు చేయాలనుంది

Jan 29, 2020 2:34PM

తెలుగులో విజయ్‌ దేవరకొండ యూత్‌ హాట్‌ ఫేవరెట్‌ హీరో. రౌడీబాయ్‌కి యువతలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. అతడితో సినిమాలు చేయడానికి టాప్‌ డైరెక్టర్స్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, నిర్మాతల సంగతి చెప్పనవసరం లేదు. విజయ్‌ దేవరకొండ ‘యస్‌’ అంటే చాలు... చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ, హీరోగారు మాత్రం ఖాళీగా లేరు. 2021 ఎండింగ్‌ వరకూ ఫుల్‌ బిజీ. ఈ మాట చెప్పింది ఏవరో కాదు... ప్రముఖ నిర్మాత కెఎస్‌ రామారావు. విజయ్‌ దేవరకొండ హీరోగా ఆయన నిర్మించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా కెఎస్‌ రామారావు మీడియాతో ముచ్చటించారు.

‘‘నేను ‘పెళ్లి చూపులు’ చూశాక విజయ్‌ దేవరకొండకు అడ్వాన్స్‌ ఇచ్చా. అతడు ప్రత్యేకమైన ఆర్టిస్ట్‌ అనిపించింది. అందుకని, అతడితో సినిమా చేయాలని అనుకున్నాను. అతడి స్టైల్‌కి తగిన ప్రేమకథ కుదరడంతో ఇప్పుడు చేశాం. క్రాంతిమాధవ్‌ ఎలాంటి సినిమా అయినా చేయగలడు. మా సంస్థలో ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చేశాడు. ఇప్పుడు మరో మంచి ప్రేమకథ చేశాడు. సినిమాపై 200 శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అని కెఎస్‌ రామారావు అన్నారు. మళ్లీ విజయ్‌ దేవరకొండతో ఎప్పుడు సినిమా చేస్తారని అడగ్గా... ‘‘నాకు చేయాలనుంది. మళ్లీ తప్పకుండా చేయాల్సిన ఆర్టిస్ట్‌ అతడు. కాకపోతే 2021 వరకూ విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నాడు. మధ్యలో నేను చేయడం కుదురుతుందో లేదో’’ అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com