రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మృతికి ప్రధాన కారణం ఇదే
on Oct 5, 2024
సుదీర్ఘ కాలంగా తన నటనతో అశేష సినీ ప్రేమికులని అలరిస్తూ వస్తున్న హీరో రాజేంద్రప్రసాద్(rajendra prasad)ఏ పాత్రలో అయినా ఒదిగిపోవడం రాజేంద్ర ప్రసాద్ నటనకి ఉన్న స్టైల్. అసలు ఆయన తెర మీద నటిస్తుంటే ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని నటనకి ఒక కిరీటాన్ని తొడిగినట్టుగా ఉంటుంది. అందుకే నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ గా జేజేలు అందుకున్నాడు.
ముఖ్యంగా కామెడీ సినిమాలకి పెట్టింది పేరైన రాజేంద్ర ప్రసాద్ హీరో పాత్రల ద్వారానే కామెడీని పండించి, వరల్డ్ మొత్తం మీద ఎక్కువ కామెడీ సినిమాల్లో నటించిన హీరోగా పేరు గడించాడు.
అలాంటి లెజండ్ పర్సనాలిటీ రాజేంద్రప్రసాద్ గారి ఒక్కగానొక్క కుమార్తె గాయత్రి(gayatri)హఠాన్మరణం చెందిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది ఆమె మరణానికి ప్రధాన కారణం గుండె పోటు అని తెలుస్తుంది.నిన్న లైట్ గా ఛాతిలో నొప్పి రావడంతో గాయత్రిని హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయడం ప్రారంభించారు. కానీ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఒంటి గంటకు తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది.దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గాయత్రి మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్ కి గాయత్రి అంటే చాలా అమితమైన ప్రేమ. చాలా సందర్భాల్లో చనిపోయిన నా తల్లిని కూతురులో చూసుకుంటున్నాని చెప్పాడు.గాయత్రి కుమార్తె సాయి తేజశ్వని కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో బాలనటిగా కీర్తి సురేష్ పాత్రలో మెరిసి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. గాయత్రి వయసు ప్రస్తుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలు.
Also Read