నేను ఎప్పుడు సింహాన్నేరా అంటున్న నాగ్..ఇది కదా కావాల్సింది
on Oct 5, 2024
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు(anr)నట వారసుడు యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)సినీ జర్నీగురించి అందరకి తెలిసిందే. మూడున్నర దశాబ్దాలపై నుంచి తండ్రి లాగానే ఎన్నో వైవిధమైన పాత్రలని పోషిస్తూ కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు.నాగ్ సినిమా రిలీజ్ అయిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. పరిపూర్ణ నటుడుకి నిలువుటద్దంగా నిలిచే నాగ్ తొలి నుంచి వివాదాలకి దూరంగా ఉంటాడు.
కొన్నిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చెయ్యడం సంచలనం సృష్టించిన విషయం అందరకి తెలిసిందే.అక్కినేని అభిమానులు అయితే ఈ విషయం మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. పలుచోట్ల సురేఖ దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసారు.ఇక నాగార్జున కూడా ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ న్యాయపోరాటానికి కూడా దిగాడు.కానీ నాగార్జున అభిమానుల్లో ఎక్కడో అసహనం నెలకొని ఉంది. ఇప్పుడు ఆ అసహనాన్ని నాగ్ కొంత మేర పోగొట్టాడు.రీసెంట్ గా నాగార్జున ఒక నోట్ ని రిలీజ్ చేసాడు. నేను ఎల్లప్పుడూ బలమైన వ్యక్తిని అనే విషయం నాకు బాగా తెలుసు.నా కుటుంబాన్ని రక్షించే విషయానికి వస్తే, నేను సింహాన్ని. అదృష్టవశాత్తూ, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలిచింది, ఇది మా నాన్నగారి నుంచి వస్తున్న గుడ్ విల్ మరియు దీవెనలగా భావిస్తున్నానని చెప్పాడు.
గతంలో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చినప్పుడు కూడా కొంత మంది నాగ్ మీద విమర్శలు చేసినా కూడా నాగార్జున ఏం మాట్లాడలేదు. దీంతో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలతో అభిమానులు చాలా సంతోషంగా ఉండటంతో పాటు మా నాగ్ నిజంగానే సింహం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నాట వీరాభిమానులు ఉన్న హీరోల్లో నాగార్జున కూడా ఒకడు. ఆయన చిటికేస్తే కదిలే అభిమానులు లక్షల్లో ఉన్నారు.
Also Read