ఆ హీరోతో రాధిక ఉన్న సీన్లు దొంగిలించారట..!
on Nov 30, 2016
రాధికా ఆప్టే..సౌత్ సినిమాల్లో ఎంతో హోమ్లీగా పద్ధతిగా ఉంటూ ఎంత మంచి పేరు తెచ్చుకుందో..మరాఠి మూవీల్లో న్యూడ్ సీన్స్ ద్వారా బోల్డ్ యాక్టర్‌గా అంతకంటే ఎక్కువ పేరే తెచ్చుకుంది. న్యూడ్ సీన్స్ చేసినా దాన్ని ధైర్యంగా ఒప్పుకోవడం, తన పనిని సమర్థించుకోవడం ద్వారా కొంతమంది నోళ్లు మూయించినా ఆమెకే చెల్లింది. అప్పట్లో స్నానం చేస్తూ బయటపడ్డ హీరోయిన్ ఫోటోలు రాధికవే అంటూ ప్రచారం జరిగింది..ఈ విషయంపై ప్రశ్నించిన ఒక జర్నలిస్ట్‌కు చెప్పు దెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది.
ఇంత ధైర్యశాలిగా పేరు తెచ్చుకున్నా కానీ ఒక విషయంలో ఆమె భయపడుతోంది. రీసెంట్‌గా ఒక సినిమా కోసం చేసిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని తన మొబైల్‌లో సేవ్ చేసుకుందట రాధిక..అయితే ఆ మొబైల్‌ని ఒక దొంగ చోరీ చేశాడట. ఆ దొంగ తన పర్సనల్ విషయాలను నెట్‌లో పెట్టకుండా పోలీసులతో కలసి పోరాటం చేస్తోందట ..అయితే ఇదంతా నిజ జీవితంలో కాదు. రాధికా ఆప్టే లీడ్ రోల్‌లో నటిస్తున్న "బొంబరియా" అనే సినిమా స్టోరీ ఇది. సో అదన్నమాట మ్యాటర్.