`RAPO 19`.. `ఉప్పెన` కాంబో మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
on Apr 17, 2021
`ఉప్పెన`.. టాలీవుడ్ బాక్సాఫీస్ కి వసూళ్ళతో నూతన ఉత్తేజాన్ని నింపిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఫిబ్రవరి 12న రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ.. ప్రధాన బలం మాత్రం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ నెస్. ఈ ఇద్దరే `ఉప్పెన` ఘనవిజయంలో ముఖ్య భూమిక పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి డీఎస్పీ, కృతి.. మరోసారి జట్టుకడుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఇస్మార్ట్ శంకర్`, `రెడ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓ ఊరమాస్ మూవీ చేయబోతున్నారు. కోలీవుడ్ కెప్టెన్ ఎన్. లింగుస్వామి తెరకెక్కించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ ఫ్లిక్ గా రాబోతోంది. కాగా, ఇందులో కృతి నాయికగా నటించనుండగా.. తాజాగా కంపోజర్ గా డీఎస్పీ ని కన్ఫామ్ చేస్తూ ప్రకటన ఇచ్చింది యూనిట్. దీంతో.. `RAPO 19`కి `ఉప్పెన` కాంబో (హీరోయిన్ - మ్యూజిక్ డైరెక్టర్) మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది చివరలో `RAPO 19` థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
Also Read