హీరోయిన్ శరీరం వస్తువు కాదు కదా...అలాంటి అవకాశాలు వద్దు
on Oct 6, 2024
గత సంవత్సరం సంతోష్ శోభన్(santosh shoban)హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కళ్యాణం కమనీయం.దీని ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన తమిళ భామ ప్రియాభవాని శంకర్(priya bhavani shankar)ఆ తర్వాత గోపిచంద్ భీమాలోను, ద్వీబాషా చిత్రంగా తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ డిమోట్ కాలనీ 2 , శంకర్, కమల్ ల భారతీయుడు 2 లోను చేసి మంచి పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆర్బీ చౌదరి తనయుడు జీవా(jiiva)హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న బ్లాక్(black)అనే మూవీలో చేస్తుంది.హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ పదకొండున విడుదల కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రియా భవాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అనే కారణంతో గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. ఒక హీరోయిన్ గా ఫ్యాషన్ పేరుతో అందాలను మాత్రం ప్రమోట్ చేయలేను, అందుకే బోల్డ్ రోల్స్ ని అంగీకరించను.నా శరీరాన్ని ఒక వస్తువుగా భావించి అందాల ఆరబోతతో అవకాశాలు అందుకోలేను.
కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని నిర్ణయం తీసుకున్నాను. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా.ఈ ప్రాసెస్ లో నెగెటివ్ రోల్ చేయడానికీ కూడా వెనుకాడను. ఎందుకంటే అది నా వృత్తి అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అదే విధంగా ఈ వ్యాఖ్యలని అందాలు ఆరబోసే హీరోయిన్స్ వింటే, ఎలా రిసీవ్ చేసుకుంటారని కూడా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
Also Read