నా కొడుకులిద్దరికి వ్యత్యాసం ఉంటే,వారసులుగా సినిమాల్లోకి వస్తారా
on Oct 6, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ప్రస్తుతం తన దేవర(devara)సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దేవర కలెక్షన్స్ పరంగా కూడా అనేక రికార్డులని సృష్టిస్తుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నాలువందల కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఐదు వందల కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ మీడియా ఎన్టీఆర్ తో మీ కుమారులు అభయ్(abhay)భార్గవ్(bhargav)లని భవిష్యత్తులో సినిమాల్లోకి తీసుకొస్తారా అని అడిగింది, అందుకు ఎన్టీఆర్ మాట్లాడుతూ నా అభిప్రాయాలు,ఇష్టాఇష్టాలకి అనుగుణంగా వాళ్ళని నడుచుకోమని చెప్పడం నాకు నచ్చదు. నాకు తెలిసి ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వాళ్ల సొంత ఆలోచనని కలిగి ఉండాలని నేను ఖచ్చితంగా నమ్ముతా. కాకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, అందుకు తగ్గ వాతావరణాన్ని మాత్రం మనం కల్పించాలి. ఇది చెయ్ అది చెయ్ అనే అడ్డంకులు సృష్టించకూడదు.
సినిమాల్లోకి అడుగుపెట్టాలి, యాక్టింగ్ లో రాణించాలని కూడా వాళ్ళని బలవంతం చెయ్యను. ఎందుకంటే నా తల్లి తండ్రులు ఆ విధంగా ట్రీట్ చేయలేదు. ఏదో సాధించాలని అనుకుంటున్నాడు, చెయ్యని అని అనుకున్నారు .అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలని గౌరవించాలనుకుంటున్నాను. కాకపోతే నా వృత్తి గురించి నా పిల్లలకి తెలుసు.తండ్రిని నటుడుగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వెయ్యాలని తనయులు కోరుకోవడం సహజంగా జరుగుతుంది.వాళ్ళిద్దరి ఆలోచనలలో కూడా చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read