ప్రణీత...బాలయ్యకి నో చెప్పిందా?
on Jun 27, 2015
ఆఫర్లు లేనన్నాళ్లూ ఓ గోల...తీరా వరుస ఛాన్సులు వస్తుంటే వామ్మో డేట్స్ అడ్జస్ట్ అవవనే ఓవర్ యాక్షన్. పవన్ మరదలు పిల్ల అదేనండీ ప్రణీతని చూస్తే ఈ మాట అనక మానం. కొత్తలో ఒక్కఛాన్స్ ప్లీజ్ అంటూ మెలికలు తెరిగింది. అత్తారింటికి దారేది తర్వాత అమ్మడికి క్రేజ్ పెరిగి టాలీవుడ్, కోలీవుడ్ లో కాస్త బిజీ అయ్యింది. మంచు ఫ్యామిలీ హీరోలతో వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు బ్రహ్మోత్సవంలో ఛాన్స్ దక్కించుకుంది. రీసెంట్ గా బాలయ్య డిక్టేటర్లో సెకండ్ హీరోయిన్ రోల్ అమ్మడిని పలకరించిందట. ఎగిరి గంతేస్తుందిలే అనుకుంటే నో వే అందట. దీంతో అవాక్కడం సినీ జనాలవంతైంది.
పనికిరాని సినిమాలు పదిచేసేకన్నా టాప్ హీరోతో ఒక్క సినిమా చేస్తే చాలు కదా అంటే....ఫుల్ బిజీ అందట. అయినా మెయిన్ రోల్ చేస్తున్న బ్యూటీలంతా ఒకేసారి నాలుగైదు సినిమాల్లో ఆడిపాడేస్తుంటే....సెకెండ్ రోల్ పిల్లకి ఇంత బిల్జప్ అవసరమా అని సగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ప్రణీత నిజంగా డేట్స్ లేక వద్దందా....లేక బాలయ్య అంటే భయపడిందా? ఫిల్మ్ నగర్లో మెయిన్ డిస్కషన్ ఇదే.