సింగర్ విలన్ అవుతున్నాడా?
on Jun 27, 2015
రంగుల ప్రపంచంలో ఎప్పుడెవరు ఎలా మారుతారో ఊహించలేం.డైరెక్టర్ హీరో అవుతాడు, హీరో నిర్మాత అవుతాడు. హీరో విలన్ అవుతాడు...సింగర్ హీరో అవుతుంటాడు...ఇలా ఒక్కటని చెప్పలేం. . రూపుతేరా మస్తానా అని యూత్ ని ఊపేసిన బాబా సెహగల్ ఈ కోవకే చెందుతాడు. ఈ గుండుబాస్ ఇప్పుడు విలన్ అవతారం ఎత్తుతున్నాడట. ఇప్పటికే రుద్రమదేవితో ఓ రోల్ చేస్తున్న బాబా సెహగల్....లేటెస్ట్ గా నాగచైతన్య సినిమాలో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నాడట.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో విలన్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు తమిళంలో ఇదే సినిమాలో శింబు హీరోగా కాగా అందులోనూ ఇతగాడే విలనట. అటు చిరు 150వ సినిమాలో కూడా ఈ సింగర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడట.
మొత్తానికి సింగర్ కాస్త సూపర్ విలన్ గా తయారయ్యేట్టున్నాడని డిస్కస్ చేసుకుంటున్నారు. రూపం కూడా ఎంచక్కా విలన్ లానే ఉండడంతో ఈ రెండు సినిమాలు క్లిక్కైతే...టాలీవుడ్ కి మరో అదిరిపోయే విలన్ దొరికినట్టే. మరి సింగర్ గా దుమ్ములేపిన బాబా...విలన్ గా ఏమేరకు ఎట్రాక్ట్ చేస్తాడో వెయిట్ అండ్ సీ.