13 ఏళ్ళ తరువాత విజయ్- ప్రకాశ్ రాజ్ కాంబో!
on Oct 8, 2021

కోలీవుడ్ స్టార్ విజయ్ కి అచ్చొచ్చిన ప్రతినాయకుల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. `గిల్లి` (`ఒక్కడు` రీమేక్), `పోక్కిరి` (`పోకిరి` రీమేక్) చిత్రాల్లో విజయ్ - ప్రకాశ్ కాంబో తమిళ తంబీలను భలేగా ఎంటర్టైన్ చేసింది. అలాగే `శివకాశి`, `విల్లు` సినిమాల్లోనూ ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇదిలా ఉంటే.. `విల్లు` (2009) తరువాత మళ్ళీ జట్టుకట్టని విజయ్, ప్రకాశ్ రాజ్.. దాదాపు 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. విజయ్, ప్రకాశ్ రాజ్ కాంబోలో వచ్చే సీన్స్ సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని టాక్. త్వరలోనే విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రంలో ప్రకాశ్ రాజ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, వంశీ పైడిపల్లి రూపొందించిన `మున్నా`, `బృందావనం`, `ఊపిరి`, `మహర్షి` చిత్రాల్లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



