ఓటీటీ బాటలో మోహన్ లాల్ మరో చిత్రం?
on Oct 8, 2021

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గత చిత్రం `దృశ్యం 2`.. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2` విశేష వీక్షకాదరణ పొందిన నేపథ్యంలో.. మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తున్న మరో సినిమా కూడా ఓటీటీ బాట పట్టబోతోందని కేరళ చిత్ర వర్గాల సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `లూసిఫర్` వంటి సంచలన విజయం తరువాత మల్టిటాలెంటెడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందిస్తున్న చిత్రం `బ్రో డాడీ`. `లూసిఫర్` పొలిటికల్ డ్రామాగా తెరకెక్కగా.. `బ్రో డాడీ`ని ఫన్ ఫ్యామిలీ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు పృథ్వీరాజ్. అంతేకాదు.. టైటిల్ రోల్ లో మోహన్ లాల్ నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రలో పృథ్వీరాజ్ దర్శనమివ్వనున్నారు. అలాగే మోహన్ లాల్ కి జంటగా మీనా, పృథ్వీరాజ్ కి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. కాగా, చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేయబోతున్నట్లు బజ్. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.
మరి.. `దృశ్యం 2` తరహాలో `బ్రో డాడీ` కూడా ఓటీటీ సెన్సేషన్ గా నిలుస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



