నాని పై ప్రదీప్ మాచిరాజు కీలక వ్యాఖ్యలు..మూవీ హిట్ అయ్యింది కదా
on Apr 12, 2025

ప్రముఖ హీరో,యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju)ఏప్రిల్ 11 న 'అక్కడ అమ్మాయిఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi Ikkada Abbayi)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన 'దీపికా పిల్లి'(Deepika Pilli)హీరోయిన్ గా చెయ్యగా,మాంక్స్ అండ్ మంకీస్ నిర్మాణ సారథ్యంలో నితిన్,భరత్ ద్వయం దర్శకత్వం వహించింది.వెన్నెలకిషోర్,మురళీధర్ గౌడ్,జాన్ విజయ్,సత్య కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయపదాన దూసుకుపోతుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా అందులో ప్రదీప్ మాట్లాడుతు మా సినిమాని ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబు,రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు.ఏప్రిల్ 11 ని మా జీవితంలో మర్చిపోలేం,సినిమా ఆధ్యంతం ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని రిలీజ్ కి ముందే మాటిచ్చాం.ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నాం.ప్రేక్షకుల ఒరిజినల్స్ రియాక్షన్ చూడాలని థియేటర్ లో దాక్కొని మరి సినిమా చూసాను.
ప్రేక్షకులందరు ఎంతో ఆనందంతో నవ్వుతు ఇలాంటి క్లీన్ ఎంటర్ టైనర్ ని చూసీ చాలా రోజులవుతుందని చెప్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.నాచురల్ స్టార్ నాని త్వరలోనే మా సినిమా చూడనున్నారు.ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారని చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



