ప్రభాస్ సిద్ధం అని అనడం నిజమేనా!
on Jul 18, 2024
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 'కల్కి' సునామి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన కమల్, శంకర్ ల 'భారతీయుడు 2' ప్లాప్ టాక్ తెచ్చుకోవడం 'కల్కి'కి ప్లస్ అయ్యింది. దీంతో ఆల్రెడీ వెయ్యి కోట్ల మార్కుని చేరుకొని మరిన్ని కల్లెక్షన్లని రాబట్టే దిశగా అడుగులేస్తోంది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ఎక్కడి దాకా వెళ్లి ఆగుతాయో అనే చర్చ అందరిలో మొదలయ్యింది. అదే టైం ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ప్రభాస్ ఖాతాలో రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 తో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి మూవీ కూడా ఉంది. ఫౌజీ అనే పేరుని మేకర్స్ లాక్ చేసారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పిరిట్ కి ఇస్తాడని, త్వరలోనే ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్పిరిట్ ని పక్కనపెట్టి ఫౌజీ ని స్టార్ట్ చేయబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇందుకు కారణాన్ని కూడా చెప్తున్నారు. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కి ఇంకాస్త సమయం పడుతుండంతో హను రాఘవపూడితో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.
ఈ మేరకు అక్టోబర్ లో షూట్ ని స్టార్ట్ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. ఇక స్టోరీ తో పాటు హీరోయిన్ విషయంలో కూడా రకరకాల చర్చలు వస్తున్నాయి. 1940వ కాలంలో సాగే కథగా రాబోతుందని, అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు. రాజా సాబ్ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది.
Also Read