కృష్ణ వంశీ చేసే పనులు చెప్తే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ
on Jul 18, 2024
తెలుగు సినిమా వైభోగం గురించి చెప్పుకోవాల్సిన సందర్భంలో కొంత మంది దర్శకుల పేర్లు స్ఫురణనకి వస్తాయి. అలాంటి వాళ్ళల్లో కృష్ణ వంశీ (krishna)కూడా ఒకరు. 1996 లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా(ninne pelladutha)దగ్గర నుంచి గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగ మార్తాండ వరకు ఆయన టచ్ చెయ్యని సబ్జక్ట్ లేదు. చూడని ఇండస్ట్రీ హిట్ లేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒక రిప్లై ఇచ్చాడు. దీంతో మహానుభావులు ఊరకనే రారనే సామెత అక్షర సత్యం అని మరోసారి నిరూపితమైంది.
అగస్ట్ తొమ్మిదిన సూపర్ స్టార్ మహేష్ బాబు(maheshbabu)బర్త్ డే సందర్భంగా మురారి రీ రిలీజ్ అవుతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలోనే 2001 లో వచ్చింది. మహేష్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ఒక ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసింది. అంత గొప్ప సినిమా కాబట్టే ఇప్పుడు మహేష్ బర్త్ డే కి ఎన్నో సినిమాల అప్షన్ల మధ్య మురారిని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆనందంలో కృష్ణ వంశీ రంగంలోకి దిగాడు. మహేష్ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఒక నెటిజన్ వంశీ కి అదిరిపోయే ప్రశ్న వేసాడు. ఇంకొన్ని రోజుల్లో మీకు అరవై రెండు సంవత్సరాలు వస్తాయి కదా! ఏమైనా బాధగా ఉందా? అని అడిగాడు. దీంతో ఒక రేంజ్ రిప్లై ఇచ్చాడు. నేను ఏజ్ గురించి ఎప్పుడూ బాధపడను. నేను నెక్ట్స్ చేయబోయేది యూత్ ఫుల్ ప్రాజెక్ట్. సో దీన్ని బట్టి నేనేంటో అర్ధం చేసుకోవచ్చు.పైగా మీరు నాతో పోటీ పడలేరు. నేను చేసేవన్నీ చెబితే హార్ట్ ఎటాక్ వస్తుంది అంటు తన దైన స్టైల్లో పంచ్ వేశాడు.
అదే విధంగా ఒక నెటిజన్ రామ్ చరణ్ (ram charan)మూవీ గురించి కూడా అడిగాడు. చరణ్ కి మీరు మంచి మెమోరబుల్ సినిమా ఇచ్చి బాకీ తీర్చుకోవాలని చెప్పాడు. నాకు గుర్తుంది సార్, నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను.ఒక సూపర్ ఐడియాతో కూడిన స్క్రిప్ట్ రెడీగానే ఉందని చెప్పాడు. కృష్ణ వంశీ, చరణ్ కాంబోలో గతంలో గోవిందుడు అందరి వాడేలే వచ్చింది.కృష్ణ వంశీ ప్రముఖ హీరోయిన్ రమ్య కృష్ణ భర్త
Also Read